హర్షపాతం | - | Sakshi
Sakshi News home page

హర్షపాతం

Jul 21 2025 5:49 AM | Updated on Jul 21 2025 5:49 AM

హర్షప

హర్షపాతం

ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025

అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

షాద్‌నగర్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కమల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, సెరికల్చర్‌, తెలుగు, జువాలజీ బోధించే పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆసక్తి గల వారు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో సంబంధిత సబ్జెక్టుల్లో 50శాతం, ఇతరులు 55శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని చెప్పారు. పీహెచ్‌డీ, ఎన్‌టీపీ, సెట్‌, ఎస్‌ఎల్‌ఈటీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. హయత్‌నగర్‌లోని డిగ్రీ కళాశాలలో ఈనెల 24న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోండి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.రాధిక శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్‌సైన్స్‌ అప్లికేషన్లు–2, ఇంగ్లిష్‌–1, డెయిరీసైన్స్‌–1, క్రాప్‌ప్రొడక్షన్‌–1 మొత్తం ఐదు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పీజీలో జనరల్‌ అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ కలిగిన వారికి, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23 సాయంత్రం 4 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

గురుకులంలో స్పాట్‌ అడ్మిషన్లు

షాద్‌నగర్‌రూరల్‌: పట్టణ సమీపంలోని నూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ, పీజీ కళాశాలలో మిగిలి ఉన్న ఎస్టీ సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతాపోలె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థినులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బీకాం (కంప్యూటర్‌ సైన్స్‌), ఎంపీసీఎస్‌, బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంపీసీ, ఐఎంఎస్‌సీ (ఇంటిగ్రేటెడ్‌ పీజీ) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98850 03390, 97034 41345, 63050 51490 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

ఫీజు దోపిడీని అరికట్టాలి

షాద్‌నగర్‌ః ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పవన్‌ చౌహాన్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యకు దూరం అవుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు సామేర్‌, శివశంకర్‌, కార్తీక్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల జిల్లా సదస్సును జయప్రదం చేయండి

కడ్తాల్‌: ఆమనగల్లులో ఈనెల 21న జరిగే దివ్యాంగుల, చేయూత పెన్షన్‌దారుల జిల్లా స్థాయి సన్నాహక సదస్సును జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం దివ్యాంగులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలు, చేయూత ఆసరా పెన్షన్‌ రూ.4 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆమనగల్లులో జరిగే సభకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జంగయ్య, మండల అధ్యక్షుడు వెంకటేశ్‌ పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌: వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఆశించిన మేర వర్షాలు లేక ఆకాశం కేసి ఎదురుచూసిన అన్నదాతలకు ఉపశమనం లభించింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు చోట్ల రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. అనేక చోట్ల చెరువులు ఉప్పొంగి, వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి.

మంచాలలో అధికంగా..

మంచాల మండలంలో సాధారణంగా 155.1 మి.మీ కాగా 242.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ 56 శాతం అధికంగా వర్షం కురిసింది. షాబాద్‌లో 54 శాతం, యాచారంలో 41 శాతం, మాడ్గులలో 39 శాతం, ఫరూఖ్‌నగర్‌లో 36 శాతం, ఆమనగల్లులో 21 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

రైతుల ఆనందం

వర్షాధార పంటలు సాగు చేసిన రైతులు వరణుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు 9 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా శుక్ర, శనివారం కురిసిన భారీ వర్షాలతో శంకర్‌పల్లి, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్‌, చేవెళ్లలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు జీవం వచ్చిందని చెబుతున్నారు

ఆ మండలాల్లో ఇంకా లోటే..

కొన్ని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నా మరి కొన్నిచోట్ల ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. గండిపేటలో –52 శాతం, రాజేంద్రనగర్‌లో –21 శాతం, హయత్‌నగర్‌లో –36 శాతం, అబ్దుల్లాపూర్‌మెట్‌లో –20 శాతం, కొందుర్గులో –34 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

మెప్మా పీడీ వెంకటేశ్వర్లు

హిమయత్‌సాగర్‌ జలాశయం

పంటలకు ఊపిరి

చేవెళ్ల: వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్న తరుణంలో భారీ వర్షం ఊరటనిచ్చింది. పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు ఊపిరిపోసినట్లు అయింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో రైతులు శనివారం ఉదయం సంతోషంగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఎరువులు, మందులు పిచికారీ చేయడంలో బిజీగా మారారు.

జీవం పోసింది

నాకున్న మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఖరీఫ్‌ మొదట్లో వర్షాలు కురిసినప్పుడు పంట వేశా ను. విత్తనాలు మొలకెత్తిన తరువాత వర్షాలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు పోయాయని అనుకున్నాను. నెలరోజులకుపైగా వర్షాలు లేకపోవటంతో పంట వాడిపోయే దశకు వచ్చింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలకు జీవంపోసినట్లు అయింది. పంటకు ఎరువులు, మందుల పిచికారీ చేసుకుంటున్నాను.

– శ్రీశైలం, రైతు, రామన్పగూడ

కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి

మొలకలకు ప్రాణమొచ్చింది

నెల రోజుల నుంచి వర్షాలకోసం ఎదురుచూస్తున్నాం. మొదట్లో రోహిణి కార్తెలోనే వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు నాటాం. అవి మొలకెత్తే సమయంలో వర్షాలు పడలేదు. నెలరోజుల నుంచి వానలు లేక ఎండిపోతాయనుకున్నాం. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మొలకలకు ప్రాణమొచ్చింది. వాగులు పారడంతో వరినాట్లు వేయడానికి కరిగెట్లు సిద్ధం చేస్తున్నాం.

– బంటు జంగయ్య, రైతు, నక్కలపల్లి, మొయినాబాద్‌ మండలం

సంప్రదింపులు ఎలా..

‘ఒక్క లే అవుట్‌ కోసం దరఖాస్తు చేస్తే ఇటు ఎఫ్‌సీడీఏ అటు హెచ్‌ఎండీఏ అధికారుల చుట్టూ పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఫైల్‌ ఎక్కడ ఏ దశలో ఉందో తెలియడం లేదు. హెచ్‌ఎండీఏ పని పూర్తి చేసినా చివరకు ఎఫ్‌సీడీఏను ఆశ్రయించాల్సిందే. ఇలా రెండు సంస్థల చుట్టూ తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది’ అని షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఒక రియల్టర్‌ అభిప్రాయపడ్డారు. గతంలో డీటీసీపీ వద్ద అన్ని పనులు పూర్తయ్యేవి. మరో చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ.. ఇప్పుడు అలా లేదని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొద్ది రోజులుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సానుకూల వాతావరణం నెలకొని ఉంది. అనుమతుల్లో జాప్యంతో ముందుకు వెళ్లలేకపోతున్నట్లు పలువురు చెబుతున్నారు.

హెచ్‌ఎండీఏలోనే ఫ్యూచర్‌ సిటీ ఫైళ్ల పరిశీలన

రెండు సంస్థల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

సాక్షి, సిటీబ్యూరో: ఫ్యూచర్‌సిటీలో లే అవుట్‌లు, భవన నిర్మాణ అనుమతుల్లో గందరగోళం నెలకొంది. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్‌ఎండీఏ తరహాలో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా నియమించారు. అయినా.. ఎఫ్‌సీడీఏలో ఇప్పటి వరకు నిర్మాణరంగానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ గాడిలో పడలేదు. దీంతో భవన యజమానులు, రియల్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పరిశీలన దశలోనే..

ఎఫ్‌సీడీఏలో సిబ్బంది కొరత కారణంగా లేఅవుట్‌లు, బిల్డింగ్‌ల నిర్మాణం కోసం వచ్చే దరఖాస్తులన్నింటినీ హెచ్‌ఎండీఏ స్వీకరించి పరిష్కరిస్తుంది. అంతిమంగా ప్రొసీడింగ్‌లు (అనుమతులు) మాత్రం ఎఫ్‌సీడీఏ నుంచి లభిస్తాయి. కానీ ఈ ప్రక్రియ ఇంకా స్థిరంగా కొనసాగడం లేదు. వందలకొద్దీ దరఖాస్తులు పరిశీలన దశలోనే ఉన్నాయి. గతంలో డీటీసీపీ వద్ద నమోదైన వాటిని సైతం ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు బదిలీ చేశారు. ట్రిపుల్‌ ఆర్‌ వరకు హెచ్‌ఎండీఏ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ యథాతథంగా కొనసాగుతోంది. హెచ్‌ఎండీఏ నుంచే స్వయంగా అనుమతులు లభిస్తున్నాయి. ఫ్యూచర్‌ సిటీ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలనలో మాత్రం జాప్యంనెలకొంటోంది. దీంతో నిర్మాణ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి భూములు కొనుగోలు చేసినప్పటికీ సకాలంలో అనుమతులు లభించకపోవడంతో లే అవుట్‌లను అభివృద్ధి చేయలేకపోతున్నట్లు ఎఫ్‌సీడీఏ పరిధికి చెందిన పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలయాపన కారణంగా ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

కొరవడిన సమన్వయం..

● హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిని రీజనల్‌రింగ్‌ రోడ్డు వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 7,250 చ.కి,మీల నుంచి 10,472 చ.కి.మీ వరకు హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు విస్తరించాయి. 7 నుంచి 11 జిల్లాలకు ఈ పరిధి పెరిగింది. కొత్తగా 1,355 గ్రామాలు హెచ్‌ఎండీఏలో విలీనమయ్యాయి. మరోవైపు ఈ పరిధిలోనే ఉన్న 56 గ్రామాలను ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి తెచ్చింది. దీంతో 765 చ.కి.మీ. ప్రాంతం ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీలో భాగమైంది. గతంలో డీటీసీపీ/హెచ్‌ఎండీఏ, స్థానిక గ్రామపంచాయతీల నుంచి నిర్మాణ అనుమతులు లభించగా ఇప్పుడు అనూహ్యంగా ఈ ప్రాంతాలన్నీ అనూహ్యంగా కొన్ని పంచాయతీలు హెచ్‌ఎండీఏ, మరికొన్ని ఎఫ్‌సీడీఏ పరిధిలోకి రావడంతో గందరగోళం నెలకొంది.

● ఎఫ్‌సీడీఏకు ప్రత్యేక అధికారిని, సిబ్బందిని నియమించిన అనంతరం ప్రభుత్వం జూన్‌ 15 నుంచి నిర్మాణరంగ అనుమతులను అందజేసే అధికారాలను సైతం ఆ సంస్థకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ హెచ్‌ఎండీఏ తరహాలో బలమైన ప్రణాళికా విభాగం ఎఫ్‌సీడీఏకు లేదు. దీంతో బిల్డ్‌నౌ ద్వారా ఆన్‌లైన్‌లో దర ఖాస్తుల స్వీకరణ దశ నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులను అందజేయడం వరకు హెచ్‌ఎండీఏ విధినిర్వహణలో భాగమైంది. అంతిమంగా ఎఫ్‌సీడీఏ నుంచి మాత్రం అధికారికంగా అనుమతులను (ప్రొసీడింగ్స్‌)ను అందజేస్తారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో కాలయాపన జరుగుతోందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఫ్యూచర్‌ సిటీ.. ప్రొసీడింగ్స్‌ పిటీ

జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

హర్షపాతం1
1/6

హర్షపాతం

హర్షపాతం2
2/6

హర్షపాతం

హర్షపాతం3
3/6

హర్షపాతం

హర్షపాతం4
4/6

హర్షపాతం

హర్షపాతం5
5/6

హర్షపాతం

హర్షపాతం6
6/6

హర్షపాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement