
మోడల్ మార్కెట్‌కు సహకరించండి
అతివేగమే ప్రాణాలు తీసింది బొంగ్లూర్ ఓఆర్‌ఆర్‌పై ప్రమాదంలో అతివేగమే ఐదుగురు ప్రాణాలు తీసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
8లోu
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై యాచారం మండల కేంద్రంలో ఆదర్శ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు సహకరించాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషన్ సభ్యులు గోపాల్‌రెడ్డి, భవాని తదితరులతో వెళ్లి శనివారం నగరంలోని మంత్రి కార్యాలయంలో కలిశారు. కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తిని గణనీ యంగా పెంచడం కోసం రైతులను ప్రోత్సహించడానికి యాచారం మండలం మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్‌పల్లి గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. పైలెట్ కింద గుర్తించిన గ్రామాల్లో పండే కూరగాయలను రైతులు స్థానికంగా విక్రయించుకుని లాభాలు పొందే ఉద్దేశంతో యాచారం బస్టాండ్ పక్కనే రెండు ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించినట్లు వివరించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు, విత్తనాలను అందించడం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఉన్నతాధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు వినతి