
యువకుడి అదృశ్యం
పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కేశగోని హరి ప్రసాద్(27) తుక్కుగూడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు డ్యూటీకీ వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన హరిప్రసాద్ సాయంత్రమైనా రాలేదు. అతడు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై అతని తండ్రి స్వామి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.