
పోలింగ్ సరళిపై అవగాహన
బడంగ్‌పేట్: బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం నేషనల్ ట్రైనింగ్ అండ్ ఆర్గనైజేషన్ పోగ్రాం, బూత్ లెవల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కుందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి హాజరై బీఎల్‌ఓలకు అవగాహన కల్పించారు. పోలింగ్ రోజుకు ముందు పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఓటరు సమాచారం స్లిప్పులను వేరే వారికి ఇవ్వకుండా చూడాలని కోరారు. 1961 ఎన్నికల నిర్వహణ నియమాలు వివరిస్తూ బీఎల్‌ఓలకు అవగాహన కల్పించారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో తహసీల్దార్ ఇందిరాదేవి, బడంగ్‌పేట కార్పొరేషన్ మేనేజర్ నాగేశ్వర్‌రావు, డిప్యూటీ తహసీల్దార్ మణిపాల్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.