
త్వరలోనే పనులు ప్రారంభం
కొహెడలో అత్యాధునిక మార్కెట్ నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశంలోని పలు మార్కెట్లపై అధ్యయనం చేసిన అధికారులు రూ.2,904 కోట్ల అంచనాతో డీపీఆర్ సిద్ధం చేశారు. ఇప్పటికే సేకరించిన రూ.314 కోట్లు మార్కెటింగ్ శాఖ అకౌంట్‌లో ఉన్నాయి. నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాం. మార్కెట్ నిర్మాణానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. త్వరలోనే ఆయన చేతుల మీదుగా పనులు ప్రారంభమవుతాయి.
– చిలుక మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, గడ్డిన్నారం
●