
పనికి వెళ్లడం లేదని..
తల్లి మందలించడంతో కొడుకు అదృశ్యం
పహాడీషరీఫ్: పనికి వెళ్లడం లేదని తల్లి మందలించడంతో కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి వాదే ముస్తఫా బస్తీకి చెందిన షేక్ సమియుద్దీన్ షరీఫ్ కుమారుడు అకేఫుద్దీన్ షరీఫ్(21) ప్రైవేట్‌గా పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా పనికి పోకపోవడంతో తల్లి ఫర్హానా బేగం ఈ నెల 19వ తేదీన ఉదయం మందలించింది. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 21న తిరిగి తల్లి ఫోన్‌కు కాల్ చేసిన షరీఫ్ ‘నేను పనికి వెళ్లడం లేదని నన్ను తిడుతున్నారు.. నేను ఎక్కడికై నా వెళ్లిపోతాను’ అంటూ కట్ చేశాడు. ఎంతకి అందుబాటులోకి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై యువకుడి తల్లి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
శిథిలావస్థకు
చెరువు తూము
దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఉన్న తూము లీకేజీ కావడంతో చెరువులో ఉన్న నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం నిండుకుంది. చెరువు తూము లీకేజీ కావడంతో నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. తూము నుంచి నీరు బయటకు పోకుండా ఉపయోగించే ఇనుప రాడ్డు పూర్తిగా లోపలికి పడిపోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. చెరువు తూము లీకేజీ అవుతున్నా ఇప్పటివరకు ఏ అధికారి కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేయాలని వ్యవసాయదారులు కోరుతున్నారు.

పనికి వెళ్లడం లేదని..