
అర్ధరాత్రి విహరిస్తే కఠిన చర్యలు
మీర్‌పేట: వేడుకలు, ఇతర కారణాలతో అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు యువతను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి తరువాత స్టేషన్ పరిధి నందనవనం, ఆర్‌ఎన్‌రెడ్డినగర్, భూపేష్‌గుప్తానగర్‌లలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న 122 మంది యువకులను గుర్తించారు. జన్మదిన వేడుకల పేరుతో కాలనీ కూడళ్లు, ప్రధాన రహదారులపైకి రావడం, అదే విధంగా రాత్రంతా బాక్స్ టైపు క్రికెట్ ఆడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఇన్‌స్పెక్టర్ సూచించారు. ఏ కారణం లేకున్నా యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలను విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు గొడవలకు కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఆపరేషన్ చబుత్రలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గౌరునాయుడు, ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
అనవసరంగా రోడ్లపైకి రావొద్దు
మీర్‌పేట సీఐ నాగరాజు