
తెలంగాణ సాహిత్యాన్ని కాపాడుకోవాలి
చేవెళ్ల: మన కవుల సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకుడు దోరవేటి చెన్నయ్య, అధ్యక్షుడు తూర్పు మల్లారెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ మహాకవుల జయంతిని ఘనంగా నిర్వహించుకుని, భావితరాలకు అందించాలన్నారు. అనంతరం సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారు ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల క్యాలెండర్‌ను రూపొందించుకున్నట్లు తెలిపారు. జూలై 27న వికారాబాద్‌లో దాశరథి, సి.నారాయణరెడ్డిల జయంతి, చేవెళ్లలో కాళోజీ జయంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల వారీగా ఉగాది కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి అనంత ప్రతినిధులుగా ఘనపురం పరమేశ్వర్, పాపిరెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కడియాల మధుసూదన్, అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కమలేశ్, కార్యదర్శి శ్రీనివాస్, హనుమంత్, సభ్యులు ఆశీర్వాదం, నర్సయ్య, ప్రసాద్, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక సభ్యులు