
కోర్టు కాంప్లెక్స్ సందర్శన
ఇబ్రహీంపట్నం: జిల్లా ప్రధాన న్యాయయూర్తి కర్ణ కుమార్ శనివారం ఇబ్రహీంపట్నం కోర్టు కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఇక్కడ కొనసాగుతున్న 15వ అదనపు జిల్లా న్యాయస్థానం, సీనియర్, జూనియర్ కోర్టులను పరిశీలించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. అదనంగా కోర్టు బిల్డింగ్, క్యాంటిన్, ఫ్యామిలీ కోర్టు తదితర అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపిస్తే.. తాను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చూస్తా నని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి రీటా లాల్‌చంద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షులు భాస్కర్, సహాయ కార్యదర్శి కృష్ణ, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్‌రెడ్డి, అంజన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తి కర్ణకుమార్‌ను ఘనంగా సన్మానించారు.
ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్
బార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం