
అగ్నివీర్ శిక్షణ కేంద్రం నుంచి యువకుడి అదృశ్యం
కందుకూరు: బెంగళూరులో అగ్నివీర్ శిక్షణ పొందుతున్న మండల పరిధిలోని బేగంపేటకు చెందిన యువకుడు దయ్యాల సతీష్ అదృశ్యమయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. దయ్యాల కొమురయ్య రెండో కొడుకు సతీష్ (20) ఈఏడాది మార్చి నెలలలో అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. శిక్షణ కోసం బెంగళూరు వెళ్లాడు. రెండు నెలలుగా ట్రైనింగ్ పొందుతున్న సతీష్ ఈనెల 24న అదృశ్యమయ్యాడు. శిక్షణలో ఓ సార్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులకు మెస్సేజ్ చేశాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే బెంగళూరుకు చేరుకుని ఈనెల 27న హోల్సూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వి.బాల్‌రాజ్ తదితరులతో కలిసి బేగంపేటలోని సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బెంగళూరులోని హోల్సూర్ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

అగ్నివీర్ శిక్షణ కేంద్రం నుంచి యువకుడి అదృశ్యం