
వ్యక్తి అదృశ్యం
పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పహాడీషరీఫ్‌కు చెందిన హబీబుల్లాఖాన్ కుమారుడు రహ్మతుల్లాఖాన్(40) తాగుడకు బానిసయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు 2024 జనవరిలో బాలాపూర్ మెట్రో సిటీలోని మా హెల్ప్ డిటెక్షన్ సెంటర్‌లో చేర్పించారు. ఆరు నెలల పాటు చికిత్స పొందిన అనంతరం రహ్మతుల్లా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం వెతికినా లాభం లేకపోవడంతో సోదరుడు అంజదుల్లాఖాన్ శుక్రవారం రాత్రి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పీఎస్‌లో లేదా 87126 62366 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.