ఆ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

ఆ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

Jun 28 2025 8:52 AM | Updated on Jun 28 2025 8:52 AM

ఆ ఉపా

ఆ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

కేశంపేట: మండల పరిధిలోని పాటిగడ్డ కేజీబీవీలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు మండల విద్యాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. ‘సాక్షి’లో ఈ నెల 21 ‘టీచర్లు ఫంక్షన్‌కి.. పాఠాలు గాలికి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీనికి స్పందించిన డీఈఓ సదరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు శుక్రవారం జిల్లా కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారు.

ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి

తుర్కయంజాల్‌: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్‌ ధరించాలని మహేశ్వరం ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ అన్నారు. పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్‌లో శుక్రవారం సీఐ గురునాయుడుతో కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడ్డప్పుడు తలకు బలమైన గాయాలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. హెల్మెట్‌ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. అనంతరం హెల్మెట్‌ లేకుండా సాగర్‌ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి చలాన్లకు బదులు కొత్త వాటిని కొనుగోలు చేయించారు. ఆయన వెంట ఎస్‌ఐ సాయినాథ్‌ ఉన్నారు.

సహకార సంఘాన్ని సందర్శించిన విద్యార్థులు

తుర్కయంజాల్‌: ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ కో ఆపరేషన్‌–2025ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్‌లో ఇంటర్న్‌షిప్‌లో ఉన్న నిజాం కళాశాల, బేగంపేట్‌ డిగ్రీ కళాశాల విద్యార్థుల బృందం శుక్రవారం తుర్కయంజాల్‌ రైతు సేవా సహకార సంఘాన్ని సందర్శించింది. సంఘం రైతుల కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పని విధానాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్యను కలిసి పలు విషయాలపై చర్చించారు. కొహెడలోని గోదాములను పరిశీలించిన అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీఓ సుధాకర్‌, సహకార యూనియన్‌ ఫ్యాకల్టీ ఆర్‌.సురేఖా రాణి, వై.పరిమళా దేవి, బి.నాగేశ్వర రావు, సీఈఓ వై.రాందాసు పాల్గొన్నారు.

జిల్లా పశువైద్యాధికారిగా డాక్టర్‌ మధుసూదన్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా పశు సంవర్థకశాఖ అధికారిగా డాక్టర్‌ మధుసూదన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన ఆర్‌జేడీ బాబుబేరిపై పలు ఆరోపణలు రావడం, ఉన్నతాధికారులు ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించి, ఆ స్థానంలో మధుసూదన్‌ను నియమించడం తెలిసింది. దీంతో ఆయన జిల్లా పశు వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిపరిశ్రమ అభివృద్ధికి కోసం పాటు పడుతానని తెలిపారు. పశు వైద్య సిబ్బంది అంతా బాధ్యతగా పని చేయాలన్నారు.

బాబుబేరిపై చర్యలు తీసుకోవాలి

ఇప్పటి వరకు ఇక్కడ ఆర్‌జేడీగా పని చేసిన బాబుబేరిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, గొర్రెల పంపిణీ పథకంలో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే జిల్లా వైద్య సిబ్బందిపై పలు రకాల వేధింపులకు పాల్పడాడ్డని హైదర్‌గూడ పీవీసీ డాక్టర్‌ ఎంకే శ్రీకాంత్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు బేరి తనపై కక్షగట్టాడని, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఫిర్యాదులు చేసు న్నాడని పేర్కొన్నారు. సరిపడా స్టాఫ్‌ లేకపోవడంతోనే టీకాలు సకాలంలో వేయలేకపోయినట్లు తెలిపారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన వ్యాక్సిన్లను ఉద్దేశపూర్వకంగా సీజ్‌ చేసి, వాటిని పాడు చేయడమే కాకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు 1
1/2

ఆ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

ఆ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు 2
2/2

ఆ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement