
తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలి
షాబాద్: ప్రజలకు తాగునీటి ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్‌ను శుక్రవారం పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీటిని సక్రమంగా శుద్ధి చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఈఎస్‌సీ కృష్ణాకర్‌రెడ్డి, ఎస్‌ఈ ఆంజనేయులు, వాటర్ గ్రిడ్ ఈఈ చల్మారెడ్డి, ఇంట్రా ఈఈ రాజేశ్వర్‌రావు, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు ప్రపుల్లాకుమార్, గంగ, ప్రియదర్శిని తదితరులు ఉన్నారు.
త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి
మొయినాబాద్‌రూరల్: మొయినాబాద్–శంకర్‌పల్లి మండలాలను కలుపుతూ చిన్నమంగళారం సమీపంలో ఈసీ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వ రగా పూర్తి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా చూడా లని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అన్నారు. చిన్నమంగళారం సమీపంలో మూసీవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కనకరత్నం, ఎస్‌సీ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ శ్రీరాములు, ఏఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్