
ఫ్యూచర్‌సిటీలోకి మరో ప్రభుత్వరంగ సంస్థ
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలోకి మరో ప్రభుత్వరంగ సంస్థ రాబోతోంది. ఈ మేరకు అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ సర్వే నంబ ర్ 119, 120లో టీజీఐఐసీ సేకరించి ఫ్యూచర్‌సిటీకి కేటాయించిన భూముల్లోని 20 ఎకరాల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ కార్యాల యం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి శ్రీదేవి, ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక సదరు సర్వే నంబర్లలోని భూములను పరిశీలించారు. రెండు ప్రదే శాల్లో ఏదో ఒకదాన్ని త్వరలో ఆ సంస్థ ఏర్పాటుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వారి వెంట తహసీల్దార్ గోపాల్, ఇతర అధికారులు ఉన్నారు.
భూములను పరిశీలించిన అధికారులు