
గోదాం పైనుంచి పడి కూలీ మృతి
హయత్‌నగర్: రేకుల షెడ్డు పైకప్పు నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిఽధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కొహెడకు చెందిన పొట్లచెరువు మల్లేశ్(55) తోటి కార్మికులతో కలిసి శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ విత్తనాల కంపెనీ గోదాం పైకప్పు రేకులను మార్చే పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మనస్తాపంతో ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన వివేక్(23) ఇదే రాష్ట్రానికి చెందిన కాంచన అనే అమ్మాయిని ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇబ్రహీంపట్నానికి వచ్చి ప్రగతినగర్‌లో నివాసముంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వివేక్ భార్య బయటకు వెళ్లిన సమయంలో, వెంటిలెటర్‌కు చీర కట్టి ఉరేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వచ్చి తలుపులు తీసి చూడగా చలనం లేకుండా కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
హుండీ చోరీకి విఫలయత్నం
ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు దర్గాలో హుండీ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ్పరకారం.. చర్లపటేల్‌గూడకు వెళ్లే మార్గంలోని జహంగీర్‌పీర్ దర్గా వద్ద హుండీని భూమిలోకి ఉంచి చుట్టూ సిమెంట్‌తో ఏర్పాటు చేశారు. ఈ హుండీని పెకిలిచేందుకు గుర్తు తెలియని దుండుగుల చుట్టూ ఉన్న సిమెంట్ తవ్వారు. ప్రయత్నం విఫలమవడంతో మధ్యలోనే వదిలి వెళ్లారు. దుండగుల ఆచూకీకి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.