
అప్పులు తీర్చేందుకు చోరీల బాట
● సీసీ కెమెరాలకు చిక్కిన నిందితులు
● అన్నదమ్ములకు రిమాండ్
యాచారం: ప్రైవేట్ ఉద్యోగస్తులైన ఇద్దరు అన్నదమ్ము లు అప్పులు తీర్చేందుకు చోరీల బాటపట్టారు. చివరకు సీసీ కెమె రాల ఆధారంగా పోలీసులకు చిక్కారు. ఈ మేరకు శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించారు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన నరేశ్, ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లికి చెందిన వెంకటేశ్ వరుసకు అన్నదమ్ములు. ఈ నెల 23న మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వ తమ్మ నక్కర్తమేడిపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తక్కళ్లపల్లి గేట్ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డుపై వేచియుంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అనదమ్ము లు హెల్మెట్లు ధరించి బైక్‌వచ్చి పార్వతమ్మ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెల్లారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసు లు శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి అపహరించిన పుస్తెలతాడును స్వాధీ నం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.