ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు

Jun 27 2025 6:30 AM | Updated on Jun 27 2025 6:30 AM

ప్రభు

ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు

తుర్కయంజాల్‌: ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అబ్దుల్లాపూర్‌మెట్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రాణి తెలిపారు. ఇంజాపూర్‌ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్‌ 199లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తహసీల్దార్‌ సుదర్శన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కూల్చివేశా రు. ఈ సందర్భంగా ఇంద్రాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సంజీవ్‌ పాల్గొన్నారు.

అధిక ఫీజులను

నియంత్రించాలి

షాద్‌నగర్‌ః అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో గురువారం సంఘం జిల్లా సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషనరీ, పుస్తకాలు, డొనేషన్‌లు, ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌, నాయకులు మణికంఠ, అరుణ్‌, వినోద్‌, వంశీవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం

యాచారం: మండలంలోని తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్‌, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ భూ బాధిత రైతులు గురువారం సమావేశమయ్యారు. టీజీఐఐసీ పేరు తీసేసి రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చినా అధికారుల్లో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులను ఎలా సాధించుకుందా మని చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులు, రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేసి రైతు భరోసా కల్పించడం, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. రైతుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కవులు సరస్వతి, నారాయణ, నిరంజన్‌, వినోద్‌రెడ్డి, గణేశ్‌, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

న్యాయం చేయండి

తుర్కయంజాల్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇంజాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 383లో హెచ్‌ఎండీఏ వెంచర్‌ ఏర్పాటు కోసం భూమి ఇచ్చిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. వెంచర్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న భూమిని కోల్పోయినందుకుగాను 100 మంది రైతులకు 300 గజాల చొప్పున ప్లాట్‌ కేటాయిస్తున్నట్లు అప్ప టి ఆర్‌డీఓ, తహసీల్దార్‌ పత్రాలు అందజేశా రని తెలిపారు. అప్పట్లో ముగ్గురికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేశారని, మిగతా వారిని అలానే వదిలేశారన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ రిజిస్ట్రేషన్‌ చేయకుండా కాలాయపన చేస్తున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్డీఓ, తహసీల్దార్‌ను కలవగా ఫైల్‌ తమ వద్ద లేదని, తాము ఏమీ చేయలేమని చెబుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు 1
1/2

ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు

ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు 2
2/2

ప్రభుత్వ భూముల కబ్జాను సహించేది లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement