
క్షయవ్యాధి నిర్మూలనే ధ్యేయం
షాద్‌నగర్‌రూరల్: క్షయవ్యాధిని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చించోడ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు స్రవంతి ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ, హెచ్‌ఐవీ, ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు ఉన్నవారు వెంటనే గల్ల పరీక్ష, ఎక్స్‌రే తీయించుకోవాలని తెలిపారు. ఈ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారన్నారు. టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం మందులను ఉచితంగా ఇస్తుందని, క్రమం తప్పకుండా ఆరు నెలలు వాడితే వ్యాధి నయమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ, డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ సూపర్‌వైజర్లు, టీబీ సూపర్‌వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.