
జేసీబీతో పని పేరిట మోసం
సిరిసిల్ల క్రైం: జిల్లాలో పలు ప్రాంతాల్లో జేసీబీతో భూమి చదును చేసే పనులు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బులు గుంజుతున్న ఇద్దరిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన గోల్కొండ చందుకుమార్, చింతపట్టి అనే ఇద్దరు యువకులు జిల్లాలోని పలువురు జేసీబీ యజమానులకు ఫోన్ చేశారు. వేములవాడ సమీపంలోని అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని.. అందులో చెట్లను చదును చేయడానికి జేసీబీ కావాలని కోరారు. ఎంట్రీ ఫీజు కోసం రూ.9వేలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికారు. అంతేకాకుండా వారి ఫోన్‌లకు డబ్బులు స్కానర్ ద్వారా పంపించుకున్నారు. డబ్బులు పంపిన వారు పని కోసం ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించి తంగళ్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. వీరి బాధితులు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఇద్దరు, ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ఒకరు ఉన్నట్లు తెలిపారు.
తంగళ్లపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు
ఇద్దరి రిమాండ్