
మట్టి లారీల సీజ్
ఇబ్రహీంపట్నం: అధిక మట్టి లోడుతో వెళ్తున్న ఐదు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారి(ఆర్టీఓ) సుభాష్ చంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో సమీపంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు సుశీల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు తనిఖీలు చేపట్టారు. అధిక లోడ్‌తో మట్టిని తరలించడమేగాక, మట్టిపై ఎలాంటి కవర్ వేయకుండా తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఐదు టిప్పర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. వాహనాలను తాత్కాలికంగా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఉంచారు.
లోడ్‌పై కవర్ కప్పాలి
వాహనాల్లో తరలించే మట్టి లోడ్‌పై తప్పని సరిగా కవర్లను కప్పాలని ఆర్టీవో సూచించారు. కవర్స్ కప్పక పోవడంతో ఆ వాహనాల నుంచి మట్టి ఎగిరిపడుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తుందన్నారు. అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.