
కారు ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి
షాద్‌నగర్ రూరల్: కారు ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన పట్టణ సమీపంలోని కేశంపేట బైపాస్ చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్వర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన డ్రైవర్ జావిద్‌అలీ (55) డీసీఎం తీసుకుని మహబూనగర్ నుంచి హైదబాద్‌వైపు వెళుతున్నాడు. డీసీఎంలోని సామాను దింపేందుకు షాద్‌నగర్ బైపాస్ వద్ద వాహనాన్ని ఆపి, కిందికి దిగి డీసీఎం వెనక వైపునకు వచ్చాడు. ఈ సమయంలో మహ్మద్ ఫసియొద్దీన్ కారులో మహబూబ్‌నుంచి హైదరాబాద్‌వైపు అతివేంగంగా వెళ్తూ.. అదుపు తప్పడంతో ఆటోను ఢీ కొట్టాడు. అనంతరం డీసీఎం వెనక నిలబడి ఉన్న జావిద్‌అలీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జావిద్‌అలీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిడక్కడే మృతి చెందాడు. ఆటో నడుపుతున్న నర్సింలు కాలు విరిగింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ రాజేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియచేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ కుమారుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజేశ్వర్ తెలిపారు.
ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
కేశంపేటబైపాస్ చౌరస్తాలో ప్రమాదం