రేపు మార్కెట్‌ దుకాణ సముదాయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రేపు మార్కెట్‌ దుకాణ సముదాయం ప్రారంభం

Jun 26 2025 10:06 AM | Updated on Jun 26 2025 10:06 AM

రేపు

రేపు మార్కెట్‌ దుకాణ సముదాయం ప్రారంభం

ఆమనగల్లు: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గూడురు భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వారు పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్‌యార్డులో దుకాణ సముదాయం ప్రారంభ ఏర్పాట్లను మార్కెట్‌ డైరెక్టర్లు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం నర్సింహ, భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్కె ట్‌ యార్డులో రూ.65లక్షలు వెచ్చించి ఎనిమిది దుకాణాలు నిర్మించామని.. ఈ దుకాణాలను శుక్రవారం నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభింస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు శ్రీశైలం, పాండురంగయ్య, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యాహక్కు చట్టం

అమలు చేయండి

డాక్టర్‌ చంటి ముదిరాజ్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ చంటి ముదిరాజ్‌, అధ్యక్షురాలు సూర స్రవంతి, ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ సుశీందర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఫీజులను నియంత్రించి, విద్యాహక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాలని కోరారు. ఆ మేరకు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రాఘవేందర్‌ ముదిరాజ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.దిలీప్‌ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి

ఆమనగల్లు: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జి ల్లా అధ్యక్షుడు సక్రునాయక్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మున్సిపల్‌ కార్యాలయం కమిషనర్‌ శంకర్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సక్రునాయక్‌ మాట్లాడుతూ.. ప్రభు త్వం మున్సిపల్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తూ రూ.25 వేల కనీస వేతనం, కార్మికులకు ఇచ్చే కిట్లు, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మికులు విజయ, వెంకటమ్మ, లక్ష్మమ్మ, పెంటయ్య,రాములు, మహేందర్‌, శ్రీను, మహేశ్‌, ప్రశాంత్‌, విజయ్‌, మేగ్య పాల్గొన్నారు.

బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బోనాల నిర్వహణకు 2,783 దేవాలయాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. బోనాల సందర్భంగా దేవాలయాల్లో ఊరేగింపు దశ గతంలో స్వాగతం, శోభాయాత్ర, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల వీరంగాలు , ఎదుర్కోలు, అమ్మవార్లకు బోనాల సమర్పణ, పట్టు వస్త్రాల సమర్పణ, కళా ప్రదర్శనలు కార్యక్రమాల నిర్వహణకు నిధులు వెచ్చించనున్నట్లు మంత్రిపేర్కొన్నారు.

రేపు మార్కెట్‌ దుకాణ  సముదాయం ప్రారంభం 
1
1/2

రేపు మార్కెట్‌ దుకాణ సముదాయం ప్రారంభం

రేపు మార్కెట్‌ దుకాణ  సముదాయం ప్రారంభం 
2
2/2

రేపు మార్కెట్‌ దుకాణ సముదాయం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement