
భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
మొయినాబాద్: ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్ హెచ్చరించారు. మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలోని సర్వేనెంబర్ 155లో 1.14 ఎకరా ల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల ను బుధవారం రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి జేసీబీతో కూల్చివేశారు. కబ్జాకు గురైన ప్రభు త్వ భూమిని కాపాడి బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాదారులు ప్రభుత్వ భూముల జోలికొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షించడంకోసం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ ఆదేశాలతో త్వరలో ఫెన్సింగ్ వేయడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూచిక బోర్డులు సైతం ఏర్పా టు చేసి ప్రభుత్వ భూములపై నిఘా పెడతామన్నా రు. ఎవరైనా ప్రభుత్వ భూము ల్లో అక్రమ నిర్మా ణాలు చేపట్టినా, కబ్జా చేసిన స్థానిక ప్రజలు రెవె న్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కూల్చివేతల్లో ఆర్‌ఐ రాజేశ్, సిబ్బంది భాస్కర్, భరత్, అంజయ్య తదితరులు ఉన్నారు.
మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్