
భూదాన భూములను కాపాడాలి
షాబాద్: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ, భూదాన భూములను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్‌లో సీపీఐ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు అసైన్డ్ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆనాటి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవ ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ కార్యకర్తలు ప్రజలు ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు సత్తిరెడ్డి, మక్బూల్, మంజుల, అంజయ్య, రఘురాం, మధు, నారాయణ, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం సీపీఐ షాబాద్ మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జంగయ్య ప్రకటించారు. మండల కార్యదర్శిగా నాగర్‌కుంట గ్రామానికి చెందిన పాలమాలకు శ్రీశైలంను ఎనుకున్నారు. సహాయ కార్యదర్శులుగా గడ్డం వెంకటేష్, రాములు, వీరితో పాటు 15 మంది కౌన్సిల్ సభ్యులను కమిటీలోకి తీసుకున్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య