
సమస్యల పరిష్కారానికి కృషి
చేవెళ్ల: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్‌జీఓ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని అట్లాస్ మినీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం టీఎన్‌జీఓ చేవెళ్ల తాలూకా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద మనసుతో ఒక డీఏ ఇచ్చిందని, త్వరలో మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తుందన్నారు. అర్థ గణాంక, ఐసీడీఎస్ శాఖల్లో పోస్టుల ఏర్పాటులో టీఎన్‌జీఓ కీలకంగా పనిచేసిందన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘాన్ని బలోపేతం చేయటంతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉద్యోగులు మెడికల్ బిల్లులు ఇప్పటికే క్లియర్ చేశారని జీపీఎఫ్ బిల్లులు కూడా త్వరలో క్లియర్ అవుతాయని చెప్పారు. టీఎన్‌జీఓలంతా సమష్టిగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మాధవ్‌గౌడ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్‌కుమార్, అజ్మత్‌పాషా, చేవెళ్ల తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, జ్యోతి, డివిజన్ కోఆర్డినేటర్ శేఖర్, శ్రీకాంత్‌గౌడ్, నాయకులు వాణి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్