
బీసీల హక్కులపై చర్చించండి
షాద్‌నగర్‌రూరల్: హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం, బీసీసేన గ్రామ కమిటీలు, కార్యాచరణపై చర్చించారు. బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్‌పై ప్రభుత్వంతో చర్చించాలని ఆర్.కృష్ణయ్యను నాయకులు కోరారు. గ్రామీణ స్థాయి నుంచి బీసీసేన కమిటీలను పటిష్టంగా వేసుకోవాలని, కులాలకతీతంగా భాగస్వాములను చేయాలని కృష్ణయ్య సూచించారు. బీసీలను అన్ని రంగాల్లో చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసేన నాయకులు సుధాకర్, దయాకర్‌చారి, బాల్‌రాజ్, మహేందర్‌గౌడ్, వెంకటయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.