
లారీ ఢీకొని ఒకరి మృతి
ఇబ్రహీంపట్నం: వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంగల్‌పల్లి చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామానికి చెందిన బుట్టి ప్రేమ్‌రాజ్(65) వాటర్ ప్లాంట్ వర్కర్‌గా పనిచేస్తూ బొంగుళూర్‌లో నివాసముంటున్నాడు. ఉప్పరిగూడ నుంచి ఇంటికెళుతుండగా ప్రేమ్‌రాజ్ స్కూటర్‌ను ఇబ్రహీంపట్నం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
పట్టుబడిన
నల్లబెల్లం ధ్వంసం
ఆమనగల్లు: వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ఇతర ముడి పదార్థాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్‌చౌహాన్ ఆధ్వర్యంలో బుధవారం ధ్వంసం చేశారు. పట్టణ సమీపంలో పెద్ద గోతిని తీసి మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో వివిధ కేసులలో పట్టుబడిన 780 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక, 40 కిలోల విప్ప పువ్వును నాశనం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు కృష్ణప్రసాద్, అరుణ్‌కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, బాబు, లోక్య, శ్రీను, ఉపేందర్, శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు.