
బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
మంచాల: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు పని చేసేది సీపీఎం అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండలంలోని ఆస్మత్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ నర్ల భిక్షపతి వర్ధంతి సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. నర్ల భిక్షపతి స్థూపం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు, కర్షకులను చైతన్యపర్చి, వారి హక్కుల కోసం ఉద్యమించే పార్టీ సీపీఎం అని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేసి ఎంతోమంది అమరులయ్యారని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక భూ పోరాటాలు, రైతు, కూలీ సమస్యలపై ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉందన్నారు. అట్టడుగు వర్గాల కోసం కమ్యూనిస్టులు చేసిన తాగ్యాలు మర్చిపోలేనివన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, మండల నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్, గోరెంకల నర్సింహ, మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.