
అసెంబ్లీ ఎదుట భారీ వాహనంలో మంటలు
నాంపల్లి: అసెంబ్లీ సమీపంలో ఓ భారీ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊహించని విధంగా వాహనంలో ఎగిసిపడటంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు అంటుకున్న సమయంలో వాహనంలోని డ్రైవరుతో పాటు మరొకరు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం మధ్యా హ్నం అసెంబ్లీ ఉస్మానియా గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం రోడ్డుపైనే పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫలితంగా కొంతసేపు నాంపల్లి నుంచి లక్డీకాపూల్ వెళ్లే దారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.