
విద్యార్థి అదృశ్యం
చేవెళ్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన మెకానిక్‌గా రాము కుమారుడు జశ్వంత్(18) ఆదర్శ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జశ్వంత్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు, బంధువుల వద్దవెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.