
మైనార్టీల అభివృద్ధికి కృషి
మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
చేవెళ్ల: మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో శనివారం ఇందరిమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం, రేవంత్‌అన్న భరోసా పథకం ద్వారా నియోజకవర్గంలోని 205 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యువత, మహిళలకు రుణాలు అందించే వెసులుబాటు కల్పి స్తామని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, టీపీసీసీ నాయకుడు జనార్దన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్‌లు డి.వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నాయకులు దర్శన్, గోపాల్‌రెడ్డి, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, వీరేందర్‌రెడ్డి, ఆయా మండలాలకు చెందిన మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.