రక్షణ | - | Sakshi
Sakshi News home page

రక్షణ

Jun 21 2025 7:21 AM | Updated on Jun 21 2025 7:21 AM

రక్షణ

రక్షణ

శనివారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2025
ప్రభుత్వ భూములకు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించి, హెచ్చరిక బోర్డులతో పాటు ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మెజార్టీ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. కొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఏ వివాదం లేని ఖాళీ భూములకు హద్దులు నిర్ణయించే పని కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేయగా, మరికొన్ని మండలాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఫెన్సింగ్‌ వైర్లు, కడీలు, హెచ్చరిక బోర్డులు, కూలీల చార్జీల చెల్లింపు కోసం అయ్యే ఖర్చులకు అంచనాలు రూపొందించి, కలెక్టర్‌కు పంపారు. నిధులు మంజూరు కావడమే ఆలస్యం ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేయనున్నారు. పట్టణ భూపరిమితి చట్టం (యూఎల్‌సీ)లో తొమ్మిది వేల ఎకరాల యూఎల్‌సీ భూములు ఉన్నాయి. వీటిలో 840 ఎకరాలు కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. ఆయా భూముల సర్వే నంబర్లు సహా కోర్టుల్లో హియరింగ్‌ తేదీలను తెలుసుకునేందుకు కొత్తగా ఈ కోర్టు పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆయా భూముల విస్తీర్ణం, నేపథ్యం, కేసు పూర్వాపరాలను క్షేత్రస్థాయిలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మొదలు..కలెక్టర్‌ వరకు అధికారులంతా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.

గుర్తించినవి ఇవీ..

● సరూర్‌నగర్‌ సర్వే నంబర్‌ 9/7లోని 3.23 ఎకరాలు, సర్వే నంబర్‌ 9/1లో 0.24 ఎకరాలు, సర్వే నంబర్‌ 9/1పీలో 0.39 ఎకరాలు, సర్వే నంబర్‌ 9/1లో 400 గజాలు, సర్వేనంబర్‌13లో 2 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. లింగోజిగూడ సర్వే నంబర్‌ 86లో 1.21 ఎకరాలు, మన్సూరాబాద్‌ సర్వే నంబర్‌ 4/పీలో 0.23 ఎకరాలు, చంపాపేట్‌ సర్వే నంబర్‌ 3లోని 850 గజాలు, బైరమల్‌గూడ సర్వే నంబర్‌ 24లో 0.10 ఎకరాలు, కర్మన్‌ఘాట్‌ సర్వే నంబర్‌ 51లో ఎకరం, సర్వే నంబర్‌ 73/1లో 2000 గజాలు, గడ్డిఅన్నారం సర్వే నంబర్‌ 31/2లో 104 గజాలను గుర్తించారు.

● కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ సర్వే నంబర్‌ 119లో 15.27 ఎకరాలు, సర్వే నంబర్‌ 120లో 12.08 ఎకరాలు, సర్వే నంబర్‌ 121లో 10.06 ఎకరాలు, సర్వే నంబర్‌ 122లో 13.03 ఎకరాలు (మొత్తం 51.04 ఎకరాలు) ఉన్నట్లు గుర్తించి, ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్‌ చేశారు. బైర్‌ఖాన్‌పల్లి సర్వే నంబర్‌ 53/1లో 15 ఎకరాలు ఉన్నట్లు గుర్తించి ఫెన్సింగ్‌ పనులు చేపట్టారు. కేశంపేట సర్వే నంబర్‌ 70లో సుమారు మూడు ఎకరాలు ఉన్నట్లు గుర్తించి ఫెన్సింగ్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

● కడ్తాల్‌ మండల పరిధిలో 15 రెవెన్యూ గ్రామాలు ఉండగా కడ్తాల్‌, కర్కల్‌పహాడ్‌లో 110 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా భూముల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. అన్మాస్‌పల్లి సర్వే నంబర్‌ 129లో 1.24 ఎకరాలకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కడ్తాల్‌ సర్వే నంబర్‌ 260లోని 80 ఎకరాల చుట్టూ హద్దురాళ్లు నాటారు.

● గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సర్వే నంబర్‌62లో 5 ఎకరాలు, సర్వే నంబర్‌ 43లో ఐదు ఎకరాలు, సర్వే నంబర్‌ 62లో ఐదు గుంటలు, కిస్మత్‌పూర్‌ సర్వే నంబర్‌ 159లో 159.10 ఎకరాలు, సర్వే నంబర్‌ 86లో 15 గుంటలు, కోకాపేట సర్వే నంబర్‌ 100లో 35 ప్లాట్లు, సర్వే నంబర్‌ 117లో రెండు ఎకరాలు, బండ్లగూడ సర్వే నంబర్‌ 50లో ఐదు గుంటలు, వట్టినాగులపల్లి సర్వే నంబర్‌ 132లో 56 ఎకరాలు, సర్వే నంబర్‌ 130లో 17.27 ఎకరాలు, సర్వే నంబర్‌ 274లో 8 ఎకరాలు, సర్వే నంబర్‌ 275లో 5.28 ఎకరాలు, సర్వే నంబర్‌ 294లో 13 గుంటలు ఉన్నట్లు గుర్తించారు. పుప్పాల్‌గూడ సర్వే నంబర్‌ 290లో ఎకరం, మణికొండ సర్వే నంబర్‌ 84లో ఎనిమిది గుంటలు, సర్వే నంబర్‌ 229లో నాలుగు గుంటలు, నార్సింగి సర్వే నంబర్‌ 134లో ఎకరం, సర్వే నంబర్‌ 126లో మూ డు ఎకరాలు, మంచిరేవుల సర్వే నంబర్‌ 283లో 10 గుంటలు, బైరాగిగూడ సర్వే నంబర్‌ 15లో పది గుంటలు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే ఆ యా భూముల్లో ఆక్రమణలు తొలగించారు. ఫె న్సింగ్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపారు.

● మొయినాబాద్‌ మండలం కనకమామిడిలో 200 ఎకరాలు, పెద్దమంగళారంలో 300 ఎకరాలు, చిలుకూరులో 30 ఎకరాలు, అజీజ్‌నగర్‌లో 150 ఎకరాలు గుర్తించారు. చుట్టూ ఫెన్సింగ్‌ వేసి బోర్డులు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

● ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల, ఖానాపూర్‌, రామిరెడ్డిగూడ, దండుమైలారం, నాగన్‌పల్లి, మంగల్‌పల్లి, నర్రేపల్లిలో 60 ఎకరాలకుపైగా గుర్తించారు. ఆయా భూముల ఫెన్సింగ్‌ కోసం రూ.40 లక్షలకుపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు.

● చేవెళ్ల మండలం హస్తేపూర్‌, అంతారం, కమ్మెట, కందవాడ, పామెన, కుమ్మేర, రావులపల్లిలో 200పైగా ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. హద్దులను నిర్ధారించి, హెచ్చరిక బోర్డులు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.

కేశంపేట మండలంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

న్యూస్‌రీల్‌

రూ.వందల కోట్ల విలువైన స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

సర్వే నంబర్ల వారీగా గుర్తింపు

కబ్జాల చెర నుంచి విముక్తి

హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు

రక్షణ1
1/1

రక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement