
సారాపై ఉక్కుపాదం
నీటి ట్యాంకర్ల సీజ్ పొలాల వద్ద బోర్ల నుంచి నీటిని నింపి ఇతర అవసరాలకు తరలిస్తున్న లారీలను అధికారులు సీజ్ చేశారు.
10లోu
ఆమనగల్లు: గ్రామాలు, తండాల్లో నాటుసారా, గుడుంబా నిరోధానికి కఠినంగా వ్యవహరించాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ సూచించారు. డ్రగ్స్, నాటుసారా రహిత తెలంగాణ కోసం అందరూ సహకరించాలని కోరారు. పట్టణంలోని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎకై ్సజ్ డీపీఈఓ ఉజ్వలారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. అనుమతిలేకుండా ఫంక్షన్‌హాళ్లు, రిసార్ట్స్, ఫాం హౌస్‌ల్లో మద్యం వినియోగించరాదని అన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అంతకుముందు గీత కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్‌చౌహాన్, ఎస్‌ఐలు కృష్ణప్రసాద్, అరుణ్‌కుమార్, స్వప్న, సిబ్బంది శంకర్, సురేశ్‌బాబు, దశరథ్, ఉపేందర్, బాబు, నర్సింహ, శ్రీను, శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి..
కడ్తాల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సరూర్‌నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ ఉజ్వలా రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్వీన్‌లో నీరా తయారీ కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. కేంద్రంలో తయారవుతున్న ఉత్పత్తుల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చరికొండ, ముద్వీన్, నాగిళ్ల, శెట్టిపల్లి తదితర గ్రామాల నుంచి హైదరాబాద్‌కు కల్లు రవాణా చేసేవారితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఎకై ్స జ్ సీఐ బద్యనాథ్ చౌహన్, ఎస్‌ఐలు కృష్ణప్రసాద్, అరుణ్‌కుమార్, స్వప్న పాల్గొన్నారు.
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్