
జోలె పట్టి విరాళాల సేకరణ
ఆమనగల్లు: ప్రభుత్వం పంచాయతీల నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పంచాయతీల్లో చెత్త సేకరించే ట్రాక్టర్ నిర్వహణ కోసం విరాళాలు సేకరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తలకొండపల్లి మండలం గట్టుప్పలపల్లిలో కొన్ని రోజులుగా చెత్త ట్రాక్టర్ లేకపోవడంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయింది. దీంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటయ్య, బీఆర్‌ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి గ్రామ కార్యదర్శిని సంప్రదించగా ట్రాక్టర్ నడిపించడానికి డీజిల్ లేదని సమాధానం ఇచ్చారు. దీంతో వారు వెంటనే గ్రామంలో తిరిగి జోలెపట్టి విరాళాలు సేకరించారు. వచ్చిన రూ.11,350ను పంచాయతీ సిబ్బందికి అందించారు. కనీసం డీజిల్ ఖర్చులు కూడా ప్రభుత్వం అందించకపోతే పారిశుద్ధ్య పనులు ఎలా చేపడతారని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాజు, జంగయ్య, శరత్‌చంద్రశర్మ, అశోక్‌గౌడ్, కృష్ణయ్య, జైపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కృష్ణయ్య, రాజు, విజేందర్, నర్సింహ, జీవ, కొండల్, ఆంజనేయులు, యాదయ్య, శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు.
చెత్త ట్రాక్టర్ డీజిల్ ఖర్చుల కోసం..