భక్తిభావం కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భక్తిభావం కలిగి ఉండాలి

Jun 20 2025 6:49 AM | Updated on Jun 20 2025 6:49 AM

భక్తి

భక్తిభావం కలిగి ఉండాలి

శ్రీ హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ

యాచారం: భక్తిభావం ఉన్న చోట ప్రజలు సంతోషంగా ఉంటారని, పసిడి పంటలు సస్యశ్యామలంగా ఉంటాయని శ్రీ హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ పేర్కొన్నారు. తక్కళ్లపల్లి తండాలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో గురువారం వార్షికోత్సవంలో స్వామిజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు భక్తిభావం పట్ల దృష్టి పెట్టాలని సూచించారు. నూతన దేవాలయాల నిర్మాణం, పూరాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాలన్నారు. పర్వతారోహకుడు అంగోత్‌ తుకారం చిన్న తనంలోనే బంగారు మైసమ్మ దేవాలయాన్ని నిర్మించి ఘనంగా నిత్య పూజలు, ఏటా వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అంగోత్‌ తుకారాం, మానస దంపతులతో పాటు కుటుంబ సభ్యులు రాందాసు, జంకు, వెంకటేష్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

రసీదులు తప్పనిసరి

చేవెళ్ల: రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని మండల వ్యవసాధికారి శంకర్‌లాల్‌ సూచించారు. మండలంలోని సీడ్స్‌, ఫర్టిలైజర్‌ దుకాణాల్లో వ్యవసాయశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి విత్తనాలు, ఎరువులు, ఫర్టిలైజర్‌ల నిల్వలను పరిశీలించారు. స్టాక్‌ రిజిస్టార్లను చెక్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుకాణాల్లో ఎప్పటికప్పుడు స్టాక్‌ నిల్వల వివరాలను బోర్డులపై పెట్టాలన్నారు. రైతులకు తప్పనిసరిగా రసీదును అందించాలని సూచించారు. నాణ్యత లేని విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వసతుల కల్పనకు కృషి

అమెజాన్‌ సీఎస్‌ఆర్‌ విభాగాధిపతి తాతాజీ

షాబాద్‌: పేద విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలని అమెజాన్‌ సీఎస్‌ఆర్‌ విభాగాధిపతి తాతాజీ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ గ్రిడ్‌ను పర్యావరణవేత్త లిబోకోహెన్‌, రాజేష్‌మైసా, రీజనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా, వైద్యం కోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసు ఎంతో ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌ స్థాయిలో షాబాద్‌లోని ఆదర్శ పాఠశాలనుఅభివృద్ధి చేస్తామన్నారు. కార్పొరేట్‌ విద్యాలయాలకు దీటుగా సంస్థ మౌలిక వసతులు కల్పించిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ కవిత, అమెజాన్‌ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

భక్తిభావం కలిగి ఉండాలి 1
1/2

భక్తిభావం కలిగి ఉండాలి

భక్తిభావం కలిగి ఉండాలి 2
2/2

భక్తిభావం కలిగి ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement