
ప్రైవేట్ బడుల దోపిడీ అరికట్టాలి
చేవెళ్ల: ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు, పెన్నులను అమ్ముతూ దందాను కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన జిల్లా విద్యాధికారి కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు, అధిక ఫీజులు, అడ్మిషన్ పేరిట రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ప్రైవేటు పాఠశాలలను గుర్తించి వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించకుండా పేద విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని మండిపడ్డారు.
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్