
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కొత్తూరు: టిప్పర్ లారీ, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో జేపీదర్గా రోడ్డులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన నరేష్(38) తన బంధువు(వృద్ధురాలు)తో కలిసి బైకుపై ఇన్ముల్‌నర్వ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. కాగా మార్గమధ్యలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా వెనకాల నుంచి వచ్చిన టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని పరిశీలించారు.