
స్థానిక పోరులో సత్తా చాటాలి
షాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ ఆకాంక్షించారు. మండలంలోని దామర్లపల్లి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్‌చారి ఆధ్వర్యంలో యువజన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోకుల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా బోకుల మహేందర్, ఉపాధ్యక్షులు బండ కుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బర్క కృష్ణ మాట్లాడుతూ.. బీసీలు ఐకమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని, అప్పుడే ఏదైనా సాధించగలమన్నారు. దేశ వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసి గ్రామస్థాయి నుంచి బలమైన ఉద్యమాన్ని నిర్మించి హక్కులను సాధించాలన్నారు. దేశ జనాభాలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతూనే ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు లింగం, మచ్చేందర్, వెంకటేష్‌ముదిరాజ్, వరలక్ష్మి, శారదగౌడ్, నర్సింహలు, బాల్‌రాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ