
అసంపూర్తి పనుల పరిశీలన
బడంగ్‌పేట్: కార్పొరేషన్ పరిధిలోని దావుత్‌ఖాన్‌గూడలో నిలిచిపోయిన పాఠశాల నిర్మాణ పనులు బుధవారం రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్నశివారెడ్డితో కలిసి మాజీ మేయర్ చిగురింత పారిజాత సందర్శించారు. ఈ సందర్భంగా పారిజాత మాట్లాడుతూ.. ఈ ఏడాది అకాడమిక్‌లోపు పాఠశాల నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో కమిషన్ మెంబర్‌కు విన్నవించగా ఆ ఫిర్యాదు మేరకు సందర్శించారన్నారు. ఒకేచోట డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. బడంగ్‌పేటలోని జిల్లా పరిషత్ పాఠశాల, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలను సందర్శించి ఆమె వివరాలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య, మాజీ కార్పొరేటర్ సుదర్శన్‌రెడ్డి, నాయకులు బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి, రాళ్లగూడం శ్రీనివాస్‌రెడ్డి, గట్టు బాలకృష్ణ, బి.కుమార్, విజయ్ తదితరులు ఉన్నారు.