
దివ్యాంగుడికి చేయూత
ఆమనగల్లు: పట్టణానికి చెందిన దివ్యాంగుడు వస్పుల ఆనంద్‌కుమార్ కుటుంబానికి హోప్ ఫర్ స్పందన సంస్థ అండగా నిలిచింది. అతనికి రూ.70 వేలతో కిరాణా దుకాణం పెట్టించింది. నార్త్ అమెరికా తెలుగు సంఘం ఆర్థిక సహకారంతో ఏర్పాటైన ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవాసంస్థ దివ్యాంగుల ఉపాధికి చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన దివ్యాంగుడు ఆనంద్‌కుమార్‌కు రిఫ్రిజిరేటర్, కిరాణ సామన్లు అందించి స్వయం ఉపాధి కల్పించింది. హోప్ ఫర్ స్పందన తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త డాక్టర్ అరికపుడి రఘు బుధవారం షాపును ప్రారంభించారు. ఇప్పటివరకు 119 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించామని చెప్పారు. వెయ్యిమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కోట లక్ష్మీ నర్సింహం, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.