
ఆమనగల్లులో ఇనుపయుగపు ఆనవాళ్లు
ఆమనగల్లు: పట్టణంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి ఇనుపయుగపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లిచ్ ఇండియా సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న సమాధులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్లనాటి సమాధులు ఉన్నాయని, గతంలో వంద వరకు ఉండగా ప్రస్తుతం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం నాలుగు సమాధుల్లో మూడు ఆనవాళ్లు సరిగా లేనప్పటికీ ఒకటి మిగిలిఉందన్నారు. ఆయన వెంట స్థపతి భీమిరెడ్డి వెంకటరెడ్డి, శిల్పులు సాయికిరణ్‌రెడ్డి, తెలుగు ఎల్లయ్య ఉన్నారు.
గొప్ప పోరాటయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య
షాద్‌నగర్: పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప పోరాటయోధుడని సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు ఎన్.రాజు అన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ డివిజన్ కార్యదర్శి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సుందరయ్య వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. సుందరయ్య నిరాడంబర జీవి అని, దేశానికి గొప్ప ఆదర్శ నాయకుడని అన్నారు. దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అని కొనియాడారు. పేదలకు భూమి కావాలని, వెట్టిచాకిరి నుంచి విముక్తి కలగాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి పదిలక్షల ఎకరాల భూ మిని పంపిణీ చేయించారని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో పోరాటం చేశారని, దళిత వాడల ఏర్పాటుకు కృషి చేశా రని అన్నారు. సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, ఆంజనేయులుగౌడ్, కావలి రాజు, కుర్మయ్య, మహ్మద్ బాబుపాల్గొన్నారు.
బాటసింగారం భూములపై విచారణ జరపండి
● ఎక్స్ వేదికగా రెవెన్యూ అధికారులకు భువనగిరి ఎంపీ సూచన
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని బాట సింగారంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ప్రచారాలపై రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఎక్స్ వేదిక ద్వారా కోరారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు నిర్ధారణ జరిగితే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమించుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆమనగల్లువాసికి
కీర్తిరత్న పురస్కారం
ఆమనగల్లు: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రముఖ కవి దాస ఈశ్వరమ్మను కీర్తిరత్న పురస్కారం వరించింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శ్రీగౌత మేశ్వర సాహితి కళాసేవా సంస్థ ఏటా సాహిత్యరంగంలో విశేష సేవలు అందించే వారికి పురస్కారాలు అందిస్తోంది. ఈ ఏడాది ఈశ్వరమ్మ అందించిన సాహిత్య సేవలకుగాను ఆమెను ఎంపిక చేశారు. మంథనిలో జరిగిన కార్యక్రమంలో ఈశ్వరమ్మకు శ్రీ గౌతమేశ్వరసాహితి కళాసేవా సంస్థ అధ్యక్షుడు దూడపాక శ్రీధర్ కీర్తిరత్న పురస్కారం అందించారు. ఈశ్వరమ్మ రాసిన కవితలకు గాను సాహితీ సౌమిత్రి అనే బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు.

ఆమనగల్లులో ఇనుపయుగపు ఆనవాళ్లు

ఆమనగల్లులో ఇనుపయుగపు ఆనవాళ్లు