స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
బంట్వారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోట్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం బలగం అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మెజార్టీ స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ నందు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కోట్‌పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్, బంట్వారం అధ్యక్షుడు మహేష్‌యాదవ్ పాల్గొన్నారు.
ఐటీఐని సందర్శించిన ఎంపీ
అనంతగిరి: వికారాబాద్‌లోని ఐటీఐ కళాశాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో ఉన్న ట్రేడ్‌లు, కోర్సులు తదితర విషయాలపై ప్రిన్సిపాల్ నరేంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేయడం గొప్ప విషయమన్నారు.
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


