
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మ ండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటు ంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన నాగిళ్ల అంజయ్య(50) వ్యవసాయం చేసుకుంటూ భార్యతో కలిసి ఉండేవాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమ్తితం షాద్‌నగర్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. అటునుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య అంజమ్మ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు. కాగా అంజయ్య మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలను వెలిబుచ్చారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.