
ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
కొందుర్గు: అద్దె చెల్లించలేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన ఘటన శనివారం జిల్లేడు చౌదరిగూడలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చెందిన కోనేరు శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం మండల కేంద్రంలోని తన ఇంటిని ఎంపీడీఓ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. ప్రతీ నెల రూ.10,942 అద్దె చెల్లించేలా ఆయన అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నేటి వరకు ఒక్క రూపాయి అద్దె చెల్లించకపోవడంతో శనివారం ఇంటి యజమాని శ్రీనివాస్ ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు. ఈ విషయమై ఎంపీడీఓ ప్రవీణ్‌ను వివరణ కోరగా మొదట్లో శ్రీనివాస్‌కు రూ.50 వేలు అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపారు. ఆ తర్వాత మూడు విడతలుగా రూ.60వేలు, రూ.16వేలు, రూ.10వేలు చెక్కులు ఇచ్చామన్నారు. డబ్బులు లేకపోవడంతో శ్రీనివాస్ ఖాతాలో నగదు జమ కాలేదన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని త్వరలో అద్దె చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన కార్యాలయానికి వేసిన తాళం తీశారు.
ఆరేళ్లుగా అద్దె చెల్లింపులో జాప్యం
అధికారుల హామీతో తాళం తీసిన యజమాని