
అక్రమ నిర్మాణం కూల్చివేత
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలోని అక్రమ నిర్మాణాన్ని కమిషనర్ రవీందర్‌రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది కూల్చివేసింది. గ్రామంలో సర్వేనంబర్ 386/3లో స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన 9.39 ఎకరాల భూమికి ఆక్రమించుకోవడంతో పాటు ప్రహరీ నిర్మాణం చేపట్టారన్న బాధితుడి ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు మంగళవారం జేసీబీతో కూల్చి వేయించారు. నిబంధనలను అతిక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.