
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్ రూరల్: పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం డాక్టర్ వెకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేశారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు వెంకట్‌రాంరెడ్డి, తాండ్ర విశాల, బంగారు స్వరూప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదయ్యయాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్, టీపీసీసీ సభ్యుడు బార్‌అలీఖాన్, పట్టణ అధ్యక్షుడు కొకళ్ల చెన్నయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్