షాబాద్: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సంకెపల్లిగూడ సర్పంచ్ కుమ్మరి దర్శన్, బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కేసీఆర్ టికెట్ ఇచ్చారని.. ఊపిరున్నంత వరకు ఆయన వెంటే నడుస్తానన్నారు. ఎన్నికల్లో తనపై అభిమానంతో ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎన్నికలు సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అమలు చేసిందో వాటిని తూచా తప్పకుండా కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు తదితరులున్నారు.
కార్యకర్తలకు అండగా ‘కారు’
మొయినాబాద్: బీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మొయినాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త ఐదు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన బీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు మంజూరైన రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఆదివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, మైనార్టీ నాయకుడు మహబూబ్, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ రవూఫ్, నాయకులు పరమేశ్, సురియాదవ్, ప్రవీణ్, ప్రమోద్, రవి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


