కొమురయ్య జయంతి అధికారికంగా జరపాలి | - | Sakshi
Sakshi News home page

కొమురయ్య జయంతి అధికారికంగా జరపాలి

Mar 29 2023 4:02 AM | Updated on Mar 29 2023 4:02 AM

మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కుర్మ సంఘం నేతలు - Sakshi

మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కుర్మ సంఘం నేతలు

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఏ మల్లేశం, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కే మల్లేష్‌ కోరారు. మంగళవారం నగరంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అలాగే కుర్మ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యిందని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సమయం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పుష్ప నాగేష్‌, అరుణ్‌, మాజీ కార్పొరేటర్‌ ఏ మధు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌ను కోరిన కుర్మ సంఘం నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement