పహాడీషరీఫ్: స్కూల్ బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళపై నుంచి వాహనం దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ భాస్కర్ కథనం ప్రకారం.. షాహీన్‌నగర్‌కు చెందిన మహ్మద్ జుబేర్, పర్వీన్ బేగం(30) దంపతుల కుమారుడు స్థానికంగా ఉన్న మదర్సాలో చదువుతున్నాడు. సోమవారం ఉదయం తన కుమారుడికి పండ్లు పంపించేందుకుగాను రెగ్యులర్‌గా వచ్చే స్కూల్ బస్సు కోసం ఆమె షాహీన్‌నగర్ హైవే హోటల్ బస్టాప్ రోడ్డులో మరో మహిళతో కలిసి నడుచుకుంటూ వెళుతోంది. ఈ సమయంలో వెనుక నుంచి టీఎస్ 07 యుజీ 1491 నంబర్‌గల వాహనం దూసుకొచ్చి పర్వీన్ బేగంను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● అక్కడికక్కడే మృతి
● స్కూల్ బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఘటన