ఇబ్రహీంపట్నంరూరల్: పేకాట స్థావరంపై సోమవారం ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ జనచైతన్యనగర్ కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు దాడి చేసి పేకాడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.47వేల నగదు, 8 సెల్‌ఫోన్లు, నాలుగు సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నారు. జూదరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
తొమ్మిది మంది అరెస్టు
రూ.47వేల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్‌ల స్వాధీనం